
తెలుసు కదా లాంచింగ్: అయ్యప్ప మాలలో కనిపించిన డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ
ఈ వార్తాకథనం ఏంటి
డీజే టిల్లు సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ, ప్రస్తుతం డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
తాజాగా సిద్ధు జొన్నలగడ్డ మరో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సిద్ధు హీరోగా చేస్తున్నాడు.
ఈ సినిమాకు తెలుసు కదా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తెలుసుకు కదా సినిమాను ఈరోజు లాంఛనంగా ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Details
అయ్యప్ప మాలలో సిద్ధు జొన్నలగడ్డ
పూజా కార్యక్రమంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ అయ్యప్ప మాలలో కనిపించారు. ప్రస్తుతం సిద్ధు ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది హీరోలు అయ్యప్ప మాల వేస్తుంటారు. అందులో సిద్ధు కూడా చేరిపోయాడు.
వెండితెర మీద యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తెరకెక్కించే యువ హీరోలు సైతం అత్యంత భక్తితో మాలలు వేస్తూ ఉండడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అదలా ఉంచితే, తెలుసు కదా మూవీ పూజా కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, హీరో నితిన్, ఆది పినిశెట్టి, దర్శకుడు బాబి, హరీష్ శంకర్ హాజరయ్యారు.
ఈ సినిమాలో రాశీ ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.