NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kanguva Trailer: సూర్య 'కంగువ' ట్రైలర్ విడుదల.. ఒంటి కన్నుతో భయపెట్టిన బాబీ డియోల్‌..   
    తదుపరి వార్తా కథనం
    Kanguva Trailer: సూర్య 'కంగువ' ట్రైలర్ విడుదల.. ఒంటి కన్నుతో భయపెట్టిన బాబీ డియోల్‌..   

    Kanguva Trailer: సూర్య 'కంగువ' ట్రైలర్ విడుదల.. ఒంటి కన్నుతో భయపెట్టిన బాబీ డియోల్‌..   

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 12, 2024
    06:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌత్ సూపర్ స్టార్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రాల్లో ఒకటైన సినిమా 'కంగువ'. ఈ ఫాంటసీ డ్రామా ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది.

    ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ విడుదల చేయగా, అది చూసిన అభిమానుల్లో మరింత ఉత్సుకత పెరిగింది.

    ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్‌కి ప్రేక్షకుల ముందుకు రాగా, దానికి కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది.

    ప్రముఖ సౌత్ సినిమా దర్శకుడు శివ దర్శకత్వం వహించిన 'కంగువ' చిత్రంలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటాని కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    వీరే కాకుండా ఈ చిత్రంలో నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రాడిన్ కింగ్స్లీ, కోవై సరళ,ఆనందరాజ్,రవి రాఘవేంద్ర,పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    వివరాలు 

    అదిరిపోయిన కంగువ ట్రైలర్  

    సూర్య తన ఎక్స్ హ్యాండిల్‌లో కంగువ ట్రైలర్‌ను పంచుకున్నాడు.'కంగువ' ట్రైలర్ 2.36 నిమిషాలు ఉంది. అందులో కథ ఏమిటి? క్యారెక్టర్లు ఏమిటి?అనేది రివీల్ చేశారు.

    కంగువ ట్రైలర్ గిరిజనుల సన్నివేశంతో మొదలవుతుంది. 'మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి.వాటన్నిటి కంటే మనది అంతు చిక్కని రహస్యం' అని వాయిస్ ఓవర్ లో ఓ మహిళ చెప్పే మాటలతో 'కంగువ' ట్రైలర్ మొదలు అయ్యింది.

    లావా ప్రవహించే నదులు,భారీ బోటులు,చేతులు నరికి సముద్రంలో పడేసే క్రూరమైన మనుషులు మధ్య తన తెగను కాపాడుకోవడానికి హీరో ఏం చేశాడు? అనేది కథ.

    యాక్షన్ సన్నివేశాల్లో సూర్య,బాబీ డియోల్ వారి వారి గెటప్, నటనతో చాలా భయపెట్టారు. అదిరిపోయిన దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.

    వివరాలు 

    అక్టోబర్ 10న 'కంగువా' విడుదల 

    ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇటీవలే ప్రకటించారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం విడుదల తేదీని సూర్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

    కంగువ అక్టోబర్ 10, 2024న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కంగువ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కంగువ

    సూర్య కంగువ నుండి ఖతర్నాక్ అప్డేట్: గ్లింప్స్ వీడియో ఎప్పుడు రిలీజ్ కానుందంటే?  సూర్య
    సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది: ఎప్పుడు విడుదల కానుందంటే?  సూర్య
    కంగువ గ్లింప్స్ రిలీజ్ టైమ్ అప్డేట్ : రాత్రి నిద్రపోకుండా చేస్తున్న సూర్య  సూర్య
    Surya Kanguva : సూర్య 'కంగువ' నుంచి లేటెస్ట్ అప్డేట్.. సినిమా ఎన్ని భాషల్లో తెలుసా కోలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025