Thalapathy Vijay: దళపతి విజయ్ మొదటి మూవీకి ఎమ్.ఎమ్ శ్రీలేఖ మ్యూజిక్ - సినిమా బడ్జెట్ ఎంతంటే..?
దళపతి విజయ్ తమిళ సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్ స్టేటస్‌ను సంపాదించాడు. ఆయనకు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా అత్యంత రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా పేరు ఉంది. ప్రతి సినిమా కోసం ఆయన వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. నాలుగు వందల కోట్ల బడ్జెట్ ప్రస్తుతం విజయ్ సినిమా అంటే కనీసం ఐదు వందల కోట్ల బడ్జెట్ అనేది సాధారణం. విజయ్ గత చిత్రం 'ది గోట్' 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైంది. ఈ స్థాయికి ఆయన ఓవర్‌నైట్‌లో రాలేదు; ఎంతో కష్టపడి ఒక్కో మెట్టుగా ఎదుగుతూ ఈ స్థాయిని చేరుకున్నాడు.
పద్దెనిమిదేళ్ల వయసులో ఎంట్రీ
పద్దెనిమిదేళ్ల వయసులో విజయ్ తన నటనా ప్రయాణాన్ని 'నాలైయ తీర్పు' సినిమాతో ప్రారంభించాడు. ఈ సినిమాకు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా, కథ విజయ్ తల్లి శోభ అందించారు. తాము సంపాదించిన ఆస్తులన్నీ పెట్టుబడి పెట్టి తమ కొడుకుతో ఎస్ఏ చంద్రశేఖర్ ఈ సినిమా తీశారు. రాజమౌళి చెల్లెలు మ్యూజిక్ ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెల్లెలు ఎమ్ఎమ్ శ్రీలేఖ మ్యూజిక్ అందించారు. 12 ఏళ్ల చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా మారి శ్రీలేఖ తన సత్తా చాటింది. ఈ సినిమాలో పాటలు పెద్ద హిట్ అయ్యాయి.
కేవలం ఇరవై లక్షల బడ్జెట్
విజయ్ డెబ్యూ మూవీ 'నాలైయ తీర్పు' కేవలం ఇరవై లక్షల బడ్జెట్‌తో తెరకెక్కింది. 1992లో విడుదలైన ఈ చిత్రం ఆర్థిక పరంగా విఫలమై, విజయ్ తండ్రి భారీ నష్టాలను చవిచూశారు. విమర్శలు విజయ్ నటనపై ఆ సినిమా విడుదల సమయంలో విమర్శలు వచ్చాయి. విజయ్ నటనలో మెచ్యూరిటీ లేదని, అతడిని కామెడీ ఫేస్ అంటూ ఎగతాళి చేశారు.
పాలిటిక్స్ లోకి ఎంట్రీ
ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. 'తమిళ వెట్రి కజగం' పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడనే ప్రచారం ఉంది. పూజాహెగ్డే...మమితా బైజు... రాజకీయ రంగ ప్రవేశానికి ముందు, హెచ్ వినోథ్ దర్శకత్వంలో ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది.