Aadarsha Kutumbam: వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'లోకి తమన్ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రం గురించి తాజా సమాచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన సమయంలో సంగీత బాధ్యతలను హర్షవర్ధన్ రామేశ్వర్‌కు అప్పగించారు. అయితే, ప్రస్తుతం ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో తమన్ చేరినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ వార్త మాత్రం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల వచ్చిన 'ఉస్తాద్ భగత్‌సింగ్' చిత్రంలో కూడా చివరి దశలో తమన్ భాగమయ్యారు. ఆ చిత్రానికి పాటలు దేవిశ్రీ ప్రసాద్ అందించగా,నేపథ్య సంగీతాన్ని మాత్రం తమన్ సమకూర్చారు.
వివరాలు
కీలక పాత్రలో నారా రోహిత్
దీంతో అప్పట్లో ఆ చిత్రం, ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' విషయంలో కూడా తమన్ పాత్రపై అభిమానులు చర్చలు జరుపుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'హౌస్ నం 47 (ఏకే 47)' అనే ఉప శీర్షికను నిర్ణయించారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మే నెల నాటికి చిత్రీకరణ పూర్తిచేయాలనే లక్ష్యంతో చిత్రబృందం కృషి చేస్తోంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు కలగలిసిన క్రైమ్ నేపథ్య కథగా ఈ చిత్రం రూపొందుతోంది. త్రివిక్రమ్, వెంకటేశ్ కలయికలో ప్రేక్షకులు ఆశించే వినోదాత్మక అంశాలు కూడా సమృద్ధిగా ఉండనున్నాయి.