Thaman: వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఇదేనా? థమన్ పోస్ట్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆదర్శ కుటుంబం'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మూవీ షూటింగ్ ఇంకా కొంత భాగం పెండింగ్‌లో ఉండటంతో.. ముందుగా ప్రకటించిన విడుదల తేదీని మేకర్స్ వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఇప్పటికే వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కొత్త విడుదల తేదీపై తాజాగా సంగీత దర్శకుడు థమన్ ఆసక్తికరమైన లీక్ ఇచ్చారు.
వివరాలు
సినిమా విడుదల తేదీపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు
'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
అయితే ఆ పోస్ట్‌ను థమన్ వెంటనే డిలీట్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ ప్రస్తావన లేకుండా కేవలం అక్టోబర్ నెలను సూచించేలా మరో పోస్ట్ పెట్టారు.
దీంతో 'ఆదర్శ కుటుంబం' సినిమా అక్టోబర్ 30న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది.
థమన్ చేసిన ఈ లీక్‌తో దాదాపు రిలీజ్ డేట్ ఇదేనని అభిమానులు భావిస్తున్నారు.
అయితే సినిమా విడుదల తేదీపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
కాబట్టి అధికారిక క్లారిటీ వచ్చే వరకు అక్టోబర్ 30 తేదీని ఖరారైనదిగా భావించలేం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
థమన్ చేసిన ట్వీట్
AK-47 🧸 🔥🔥🔥🔥🔥🔥🏆🏆🏆❤️🔥❤️🔥❤️🔥
— thaman S (@MusicThaman) October 6, 2026
🗯️ - 10 - 2026 💪🏾
Venky Sir Trivik Sir it’s a SIXER SIR 🏆 pic.twitter.com/xdxZlXoUdg