కీడా కోలా టీజర్: తరుణ్ భాస్కర్ స్టైల్ లో బ్రహ్మానందం కామెడీ
పెళ్ళి చూపులు సినిమాతో క్రేజీ హిట్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది వంటి యూత్ ఫుల్ కామెడీ సినిమాతో వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత దర్శకత్వం వైపు తరుణ్ భాస్కర్ వెళ్ళలేదు. చాలా వరకు సినిమాల్లో నటుడిగా కనిపించాడు. ఇక డైరెక్షన్ చేయట్లేదేమో అనుకునే టైమ్ లో కీడా కోలా అనే సినిమాను ప్రకటించాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు కీడా కోలా టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ మొదటి షాట్ లోనే బ్రహ్మానందంతో పంచ్ వేయించి, ఈ సినిమా నవ్వులు పంచే విధంగా ఉంటుందని చూపించాడు.
హీరోగా 31 వెడ్స్ 21 ఫేమ్ నటుడు
టీజర్ లో కథ గురించి పెద్దగా తెలియట్లేదు. కాకపోతే టైటిల్ కి తగినట్లుగా కోలాని(కూల్ డ్రింక్), కీడా(పురుగును)గా చూపించాడు. కోలాలో పడిపోయిన పురుగుకు, సినిమా కథకు ఏదో సంబంధం ఉందని టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్ లో కనిపించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇందులో తరుణ్ భాస్కర్ డాన్ పాత్రలో కూడా నటిస్తున్నాడు. 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. క్రైమ్ కామెడీ కథగా రూపొందిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. కే వివేక్ సుధాన్షు, సాయిక్రిష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌషిక్ నండూరి సంయుక్తంగా కీడా కోలా సినిమాను నిర్మిస్తున్నారు.