Page Loader
Abhishek Bachchan: ఆ వార్తలు మా ఇంటి లోపలికి రావు.. విడాకులపై స్పందించిన అభిషేక్ 
ఆ వార్తలు మా ఇంటి లోపలికి రావు.. విడాకులపై స్పందించిన అభిషేక్

Abhishek Bachchan: ఆ వార్తలు మా ఇంటి లోపలికి రావు.. విడాకులపై స్పందించిన అభిషేక్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ దంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ విడిపోతున్నారనే వార్తలు కొంతకాలంగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ పరోక్షంగా స్పందించారు. తన కుటుంబం సోషల్ మీడియా ప్రచారాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదని, అలాంటి వార్తలు తమపై ప్రభావం చూపవని స్పష్టం చేశారు. 'మా వర్క్‌ రిలేటెడ్ విషయాలు మేము ఇంట్లో చర్చించుకుంటాం. కానీ దానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వం. మా కుటుంబంలో సినీ నేపథ్యం ఉన్నందున, ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలో, ఏదిని తేలిగ్గా వదిలేయాలో నాకు బాగా తెలుసు. సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్లు, పోస్ట్‌లు నన్ను ప్రభావితం చేయలేవు. నా తల్లి, భార్య ఎవరు బయట ఏమంటారో మా కుటుంబంలోకి అనవసరంగా తీసుకురారు'' అని అభిషేక్‌ తెలిపారు.

Details

ఆరాధ్య గొప్ప మహిళగా ఎదుగుతోంది

అభిషేక్‌ తన భార్య ఐశ్వర్యారాయ్‌ను 1995లో స్విట్జర్లాండ్‌లో తొలిసారి కలిశానని గుర్తు చేసుకున్నారు. 'నాన్న షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు బాబీదేవోల్‌, ఐశ్వర్య ఓ సినిమా షూట్‌లో పాల్గొంటున్నారు. అందరం కలిసి డిన్నర్‌కు వెళ్లాం. అప్పుడే ఆమెతో కొంతసేపు మాట్లాడాను. కానీ, అప్పట్లో నా మాటలు ఆమెకు అర్థం కాలేదని కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పిందని తెలిపారు. తన కుమార్తె ఆరాధ్య గురించి మాట్లాడిన అభిషేక్‌, ఆమెకు ఫోన్‌ లేదని, సోషల్‌మీడియా ఖాతాలు కూడా లేవని చెప్పారు. 'ఆరాధ్య మా కుటుంబానికి గర్వకారణం. ఆమెపై మేము చాలా గౌరవంగా ఉన్నాం. ఆమె ఒక గొప్ప మహిళగా ఎదుగుతోంది. దీనికి పూర్తి క్రెడిట్‌ ఐశ్వర్యకే ఇవ్వాలని అభిషేక్‌ ప్రశంసించారు.