Loading...
Simhadri: 'సింహాద్రి'లో అదే అతిపెద్ద రిస్క్.. అందరూ వద్దన్నా రాజమౌళి వెనక్కి తగ్గలేదు!
'సింహాద్రి'లో అదే అతిపెద్ద రిస్క్.. అందరూ వద్దన్నా రాజమౌళి వెనక్కి తగ్గలేదు!

Simhadri: 'సింహాద్రి'లో అదే అతిపెద్ద రిస్క్.. అందరూ వద్దన్నా రాజమౌళి వెనక్కి తగ్గలేదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో 2003లో విడుదలైన 'సింహాద్రి' తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. యాక్షన్‌, భావోద్వేగాలు, పాటలు, కథనం.. ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ చిత్రాన్ని ఘన విజయాన్ని అందించింది. ఈ సినిమా అటు రాజమౌళి, ఇటు ఎన్టీఆర్ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఒక కీలక సన్నివేశాన్ని తెరకెక్కించే విషయంలో రాజమౌళి తీసుకున్న సాహసోపేత నిర్ణయం గురించి ఆయన ఓ సందర్భంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వివరాలు

'హీరో ఇలా చేస్తే ప్రేక్షకులు ఒప్పుకోరు' అన్న వారంతా..

'సింహాద్రి' సినిమాలో వేలాది మంది అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు కథానాయకుడు ఓ మంచి వ్యక్తిని చంపాల్సి వచ్చే సన్నివేశం ఉంటుంది.

కథలో ఇదే అత్యంత కీలకమైన మలుపు. ఈ ఆలోచనను రాజమౌళి తన కుటుంబ సభ్యులతో పాటు చిత్రబృందానికి వివరించగా.. ఒక హీరో ఇలా చేస్తే ప్రేక్షకులు అసలు అంగీకరించరని చాలామంది అభిప్రాయపడ్డారట.

అయితే రాజమౌళి మాత్రం ఆ భావోద్వేగ సన్నివేశమే కథకు ప్రాణమని బలంగా నమ్మారు.

ప్రేక్షకులు ఆ ఎమోషన్‌ను తప్పకుండా అర్థం చేసుకుని, పాత్రతో కనెక్ట్ అవుతారనే విశ్వాసంతో ఎలాంటి మార్పులు చేయకుండా ఆ సన్నివేశాన్ని తెరకెక్కించారు.

వివరాలు

నిజమైన రాజమౌళి విజన్

సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి నమ్మకమే నిజమైంది. ఆ సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో కదిలించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఆ ఏడాది 'సింహాద్రి' అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా ఆ ఎమోషనల్ సీన్ అప్పట్లో విస్తృత చర్చకు దారి తీసింది.

ADVERTISEMENT

వివరాలు

ఎన్టీఆర్ - రాజమౌళి.. విజయవంతమైన కాంబినేషన్

ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజమౌళి దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రం 'స్టూడెంట్ నెం.1' ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి భారీ విజయంగా నిలిచింది.

ఆ తర్వాత వచ్చిన 'సింహాద్రి' ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి, ఎన్టీఆర్‌ను మాస్ హీరోగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.

అనంతరం వచ్చిన 'యమదొంగ' కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ విజయవంతమైన కాంబినేషన్‌లో వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన పాన్ ఇండియా చిత్రంగా నిలిచిపోయింది.

ఇలా ప్రతి సినిమా కొత్త విజయాన్ని అందిస్తూ, ఎన్టీఆర్-రాజమౌళి జోడీ టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటిగా నిలిచింది.

ADVERTISEMENT