LOADING...
Film Producers: సినీ రంగంలో మరో అలజడి.. పర్సంటేజీ విధానంపై వివాదం
సినీ రంగంలో మరో అలజడి.. పర్సంటేజీ విధానంపై వివాదం

Film Producers: సినీ రంగంలో మరో అలజడి.. పర్సంటేజీ విధానంపై వివాదం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 10, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో సినిమాలను పర్సంటేజీ పద్ధతిలో ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ తీసుకున్న నిర్ణయానికి నిర్మాతల గిల్డ్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. థియేటర్లకు ఆదాయంలో శాతం ఇవ్వడం సాధ్యం కాదని నిర్మాతల గిల్డ్‌ స్పష్టం చేసింది. ఇంతకుముందు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో సినిమాలు అద్దె విధానంలోనే ప్రదర్శించబడుతున్నాయి. అయితే మల్టీప్లెక్స్‌ల మాదిరిగానే హైదరాబాద్‌లోని 23 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో కూడా పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని ఇటీవల తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్ణయించిన నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది.

వివరాలు

1 నుంచి ఆ థియేటర్లు మూసివేత..

ఇదే సమయంలో, పర్సంటేజీ పద్ధతి అమలు చేసినప్పుడే సినిమాలను ప్రదర్శిస్తామని ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పష్టం చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానం అమలులో ఉందని కూడా పేర్కొంది. తమ నిర్ణయాన్ని పక్కన పెట్టి నిర్మాతల గిల్డ్‌ ఎలా వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదని ఫిల్మ్‌ ఛాంబర్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఏప్రిల్‌ 30లోపు తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. పర్సంటేజీ విధానం అమలు చేయకపోతే మే 1 నుండి సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లను మూసివేయాలనే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ సంఘం వెల్లడించింది.

Advertisement