Page Loader
Akhanda 2: అఖండ-2 హంగామా మొదలైంది.. గూజ్‌బంప్స్‌ స్టఫ్ కోసం ఓటీటీలు పోటీ!
అఖండ-2 హంగామా మొదలైంది.. గూజ్‌బంప్స్‌ స్టఫ్ కోసం ఓటీటీలు పోటీ!

Akhanda 2: అఖండ-2 హంగామా మొదలైంది.. గూజ్‌బంప్స్‌ స్టఫ్ కోసం ఓటీటీలు పోటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్‌ 'అఖండ-2' ఇప్పటికే సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. తొలి భాగం 'అఖండ' భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రెండో భాగంపై ప్రేక్షకుల్లోనూ, ఓటీటీ సంస్థలలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిత్రీకరణలో సింహభాగం పూర్తి కావడంతో ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఫైనల్ కట్ పూర్తి కాకముందే ఈ చిత్రానికి ఓటీటీ రంగంలో భారీ డిమాండ్ ఏర్పడింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం హాట్‌స్టార్‌ మునుపటి మాదిరిగా కాకుండా జియోతో కలిసి 'జియో హాట్‌స్టార్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

Details

రూ.60 కోట్లు ఆశిస్తున్నట్లు సమాచారం

సినిమా నిర్మాణ సంస్థ ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ ద్వారా రూ.60 కోట్లు ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మూడు సంస్థల మధ్య హక్కుల కోసం బిడ్డింగ్ వార్‌ మొదలైంది. ఎవరు ఎక్కువ మొత్తాన్ని కోట్ చేస్తే, వారికి హక్కులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రతినిధులు సినిమా రఫ్ కట్‌ను వీక్షించినట్లు తెలిసింది. వారు ప్రధానంగా ఉత్తర భారతదేశానికి చెందినవారిగా ఉండగా, సినిమా వీక్షించిన వెంటనే డివోషనల్ వైబ్రేషన్‌తో థియేటర్‌ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది. దీంతో ఆ సంస్థ సినిమా తీసుకోవడంపై మరింత ఆసక్తిని చూపిస్తోందట.

Details

త్వరలోనే డిజిటల్ హక్కులు దక్కే అవకాశం 

ఈ స్థాయిలో ఓటిటి సంస్థలు సినిమా విడుదలకు ముందే పోటీ పడడం, డిజిటల్ రైట్స్‌కు భారీ రేట్లు ఇవ్వడం ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా చూస్తున్నాం. ఓటిటి మార్కెట్ కాస్త తగ్గుముఖం పట్టిన ఈ రోజుల్లోనూ, బాలయ్య చిత్రం ప్రీ రిలీజ్ స్టేజ్‌లోనే ఇంత భారీ డిమాండ్‌ను సొంతం చేసుకోవడం విశేషమే. సర్వసాధారణంగా సినిమాకు విడుదల తర్వాత స్పందన ప్రకారం రేట్లు మారుతుంటే, 'అఖండ-2' మాత్రం ఫైనల్ కట్ సిద్ధం కాకముందే కమర్షియల్‌ హంగామా ప్రారంభించింది. ఇక ఫైనల్‌గా డిజిటల్ హక్కులు ఎవరికి దక్కనున్నాయో త్వరలోనే తేలనుంది.