Loading...
Nayanthara : నయనతార కళ్లను తెరిపించిన బిజినెస్.. ప్రమోషన్స్‌పై మారిన ఆలోచన!
నయనతార కళ్లను తెరిపించిన బిజినెస్.. ప్రమోషన్స్‌పై మారిన ఆలోచన!

Nayanthara : నయనతార కళ్లను తెరిపించిన బిజినెస్.. ప్రమోషన్స్‌పై మారిన ఆలోచన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెమ్యునరేషన్‌లో మరో కోటి రూపాయలు అదనంగా ఇస్తామన్నా నయనతార సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌కు వచ్చే ప్రసక్తే లేదని చెబుతుందట. సినిమా సైన్‌ చేయడానికి ముందే తనకు ప్రమోషన్స్‌కు హాజరయ్యే ఆసక్తి లేదని, ఆ షరతుకు అంగీకరిస్తేనే సినిమాలో నటిస్తానని స్పష్టం చేస్తుందట. అందుకు ఓకే అంటేనే అగ్రిమెంట్‌పై సంతకం చేస్తుందని సమాచారం. మొదటి నుంచీ నయనతార సినిమాల విషయంలో ఇదే విధానాన్ని పాటిస్తూ వస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొంది. దిగ్గజ దర్శకుడు బాపు దర్శకత్వం వహించడం, ప్రభుదేవాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకోవడం, 'శ్రీరామరాజ్యం' తన చివరి సినిమా కావడంతో ఆ మూవీ ప్రమోషన్స్‌కు నయనతార హాజరైంది.

వివరాలు

'గాడ్ ఫాదర్' ఈవెంట్ కు రాని నయనతార

ఆ తర్వాత ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయనతార 'గాడ్ ఫాదర్' ఈవెంట్స్‌కు వస్తుందని చాలామంది భావించారు.

కానీ అలా జరగలేదు. చిరంజీవితో కలిసి నటించిన 'సైరా నరసింహారెడ్డి' ప్రమోషన్స్‌కు కూడా ఆమె హాజరు కాలేదు.

'గాడ్ ఫాదర్'లో చిరంజీవికి చెల్లెలిగా కీలక పాత్ర పోషించినప్పటికీ.. ఆ సినిమా ప్రమోషన్స్‌కు మాత్రం నయనతార దూరంగానే ఉంది.

అయితే నిర్మాతగా మారిన తర్వాత ప్రమోషన్స్‌ విలువ ఏంటో నయనతారకు అర్థమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిర్మాతగా వ్యవహరించిన 'కనెక్ట్' సినిమా కోసం తెలుగు, తమిళం అనే తేడా లేకుండా వివిధ ప్రాంతాల్లో ప్రమోషన్స్‌లో పాల్గొంది.

సొంతంగా నిర్మించిన సినిమాకు ఒకలా, ఇతర నిర్మాతల సినిమాలకు మరోలా వ్యవహరిస్తోందంటూ అప్పట్లో నయనతార విమర్శలు కూడా ఎదుర్కొంది.

వివరాలు

ఇటీవల నయనతారలో కొంత మార్పు

సినిమాలతో పాటు బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టిన నయనతార స్కిన్‌కేర్‌ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

బిజినెస్ ఉమెన్‌గా బ్రాండ్ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూ వరుస యాడ్స్‌లో నటించింది. నయనతార దంపతులు మలేషియాకు వెళ్లి అక్కడ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ పాల్గొన్నారు.

దీంతో బిజినెస్‌పై చూపిస్తున్న శ్రద్ధను సినిమా ప్రమోషన్స్‌పై ఎందుకు చూపించడం లేదంటూ నెటిజన్లు ఆమెను ప్రశ్నించారు.

''మీరొక్కరే కాదు.. నిర్మాతలు కూడా డబ్బులు పెట్టి బిజినెస్ చేస్తున్నారు'' అంటూ కొందరు కామెంట్స్ చేశారు.

అయితే సొంత సినిమాలు, ఓన్ ప్రొడక్షన్స్‌కు మాత్రమే ప్రమోషన్స్ చేసే నయనతారలో ఇటీవల కొంత మార్పు కనిపిస్తోంది. 'మన శంకర వరప్రసాద్' ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఒక్కదానికీ ఆమె హాజరు కాలేదు.

ADVERTISEMENT

వివరాలు

పెద్దగా కారణాలు లేవు

కానీ షూటింగ్ మొదటి రోజు, చివరి రోజు సందర్భంగా విడుదల చేసిన రెండు వీడియోలతో మాత్రం ఆకట్టుకుంది. అనిల్ ఏం మాయ చేశాడో కానీ నయనతారను ప్రమోషన్స్‌కు ఒప్పించాడంటూ చిరంజీవి కూడా పలుమార్లు చెప్పాడు.

ఇక ఎప్పుడూ లేనిది 'టాక్సిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నయనతార కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

యష్ స్వయంగా ఫోన్ చేయడంతో ఆయనకు 'నో' చెప్పలేకపోయానని, అందుకే ఈ కార్యక్రమానికి వచ్చానని నయనతార స్వయంగా చెప్పింది.

అదే సమయంలో ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటానికి పెద్దగా ప్రత్యేక కారణాలేవీ లేవని ఆమె వివరించింది.

ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొనలేననే భావనతోనే సాధారణంగా వాటికి దూరంగా ఉంటానని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు

'టాక్సిక్' ప్రమోషన్స్ కు హజరైన నయనతార

సినిమా ప్రమోషన్స్‌కే కాకుండా ఇంటర్వ్యూలకు కూడా నయనతార దూరంగా ఉంటుంది.

అయితే 'టాక్సిక్' విషయంలో మాత్రం ఆమె ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

దీంతో రాబోయే సినిమాల విషయంలోనూ నయనతార తన వైఖరిని మార్చుకుని ప్రమోషన్స్‌కు వస్తుందా? లేక 'టాక్సిక్'కు మాత్రమే ఈ మార్పు పరిమితం అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT