this week telugu movies: మార్చి మూడో వారం సందడి.. థియేటర్-ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ నటుడు టోవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'పళ్లి చట్టంబి'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని డిజో జోస్ ఆంటోనీ తెరకెక్కిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగులోనూ ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదల కానుంది. విజయ్ రాఘవన్, సుధీర్, బాబురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1950-60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా రూపొందినట్టు విడుదలైన ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి.
వివరాలు
ఏప్రిల్ 17న రిలీజ్
ఇక 'పాపం ప్రతాప్' చిత్రం ప్రేమ, పెళ్లి అనంతర జీవితంపై ఆసక్తికర కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. "ఇప్పటివరకు ప్రేమలో గెలిచాం.. పెళ్లి తర్వాత ఆ ప్రేమ ఎలా ఉంటుంది?" అనే ప్రశ్న చుట్టూ కథ తిరుగుతుంది. ఈటీవీ విన్ ఒరిజినల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటిస్తున్నారు. ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వం వహిస్తుండగా, రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదల కానుంది. అజయ్ ఘోష్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వివరాలు
బ్యాడ్‌బాయ్ కార్తీక్ లో హీరోయిన్ గా విధి
''తిమ్మరాజుపల్లి టీవీ'' అనే చిత్రం 90ల తరానికి సంబంధించిన జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసేలా రూపొందుతోంది. హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ఈ చిత్రంతో సాయితేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. వి. మునిరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో, అప్పటి కాలంలో టీవీ కొనడం, చూడడం కోసం ప్రజలు పడిన కష్టాలను వినోదాత్మకంగా చూపించనున్నారు. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన 'బ్యాడ్‌బాయ్ కార్తీక్' చిత్రం కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ దేశినా (రమేశ్) దర్శకత్వం వహించారు. విధి హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేశ్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
వివరాలు
భయపెట్టేందుకు సిద్ధమవుతున్న 'భూత్ బంగ్లా'
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'భూత్ బంగ్లా' కూడా ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ చిత్రంలో వామికా గబ్బీ, టబు కథానాయికలు. పరేశ్ రావెల్ కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 17న విడుదల కానుండగా, ఒకరోజు ముందుగా ఏప్రిల్ 16న పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నారు. ఇక 'తెరచాప' ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమైంది. నవీన్‌రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జోయెల్ జార్జ్ తెరకెక్కించారు. కైలాష్ దుర్గం నిర్మించారు. రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సముద్ర తీర ప్రాంత గ్రామంలో జరిగే కథగా ఇది రూపొందింది.
వివరాలు
ఓటిటిలో రిలీజయ్యే మూవీలు ఇవే
ఈటీవీ విన్ మా ఇంటి కథ (మూవీ) ఏప్రిల్ 17 నెట్‌ఫ్లిక్స్ ఉస్తాద్ భగత్ సింగ్ (మూవీ) ఏప్రిల్ 16 యూత్ (మూవీ) ఏప్రిల్ 16