Page Loader
Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల!

Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటిటిలో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌ల్లో 'స్క్విడ్ గేమ్' ముందు వరుసలో ఉంటుంది. డబ్బు కోసం మనుషులు జీవితాలను పణంగా పెట్టి ఆడే నెత్తుటి ఆటను అద్భుతంగా చూపిస్తూ ఈ సిరీస్ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇప్పటికే విడుదలైన రెండు పార్ట్స్‌కు గ్లోబల్ స్థాయిలో విశేషమైన క్రేజ్ వచ్చింది. తొలి సీజన్‌కు వచ్చిన అపూర్వమైన స్పందనతో రెండో సీజన్‌ను రూపొందించారు. ఇక రెండో భాగం విడుదలైన తరువాత ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Details

జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ఇప్పుడు మూడో పార్ట్‌ను సిద్ధం చేశారు. ప్రముఖ దర్శకుడు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ తెరకెక్కించిన ఈ తుది భాగం నుంచి తాజాగా ఓ భారీ అప్డేట్‌ను విడుదల చేశారు. తాజాగా 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్‌ను విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ సిరీస్‌లోని అన్ని పనులు పూర్తయ్యాయి. జూన్ 27 నుంచి నెట్‌ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. 'గేమ్ ఎండ్‌కు వచ్చింది' అనే మేకర్స్ వ్యాఖ్యలతో ఇది ఈ సిరీస్‌కు తుది భాగమనే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే 'స్క్విడ్ గేమ్ 3'తో ఈ థ్రిల్లింగ్ జర్నీకి ముగింపు పలుకనున్నారు.