
జవాన్-2ను కన్ఫార్మ్ చేసిన దర్శకుడు.. విక్రమ్ రాథోడ్ పాత్రతో పార్ట్ 2
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబట్టింది.
తమిళ డైరక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి 1000 కోట్ల వైపు దూసుకెళ్తుంది.
ఈ సినిమాలో షారుక్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటించారు.
అయితే ఈ పాత్రలో తండ్రి 'విక్రమ్ రాథోర్' పాత్రకు మంచి స్పందన లభించింది. ఆడియన్స్ లో ఈ పాత్రకి మంచి క్రేజ్ వచ్చింది.
దీంతో ఈ పాత్రతో ఓ కథ ఉంటే బాగుండేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.
తాజాగా మూవీ ప్రెస్ మీట్ డైరక్టర్ అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జవాన్ 2 సిక్వెల్ పై అట్లీ స్పందించారు.
Details
జవాన్ 2 సిక్వెల్ ఉంటుందన్న అట్లీ
జవాన్ 2 సిక్వెల్ ఉంటుందని, పార్ట్ 2 విక్రమ్ రాథోర్ పాత్రతో డిజైన్ చేస్తానంటూ అట్లీ పేర్కొన్నారు.
జవాన్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది విక్రమ్ రాథోర్ పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారని, అందుకనే ఆ పాత్రతో పార్ట్ 2ని ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం అట్లీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జవాన్ మూవీని 350 కోట్లతో నిర్మించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించాడు.