
Eagle: రవితేజ ఈగల్ మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈగల్'.
ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే పలు కారాణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడిందని, జనవరి 26న విడుదలయ్యే అవకాశాలున్నాయని కొన్ని వెబ్ సెట్లు వార్తలు ప్రచురించాయి.
ఈ పుకార్లపై తాజాగా 'ఈగల్' స్పందించింది. అవన్నీ రూమర్స్ అని, ముందుగా అనుకున్న తేదీకే సినిమా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
కార్తీక్ ఘట్టమనేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
Details
మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ
యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న 'ఈగల్' సినిమాలో రవితేజ పలు విభిన్న కోణాల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటిస్తోంది. నవదీప్, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు ఇటీవల మరో ప్రాజెక్టును రవితేజ అనౌన్స్ చేశారు. డైరక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి రవితేజ నటించనున్నాడు.