Page Loader
Pushpa-2: అల్లు అర్జున్ ఫాన్స్ కి క్రేజీ అప్డేట్.. 'పుష్ప ది రూల్' ఫస్ట్ ఆఫ్ లాక్‌డ్ 
అల్లు అర్జున్ ఫాన్స్ కి క్రేజీ అప్డేట్

Pushpa-2: అల్లు అర్జున్ ఫాన్స్ కి క్రేజీ అప్డేట్.. 'పుష్ప ది రూల్' ఫస్ట్ ఆఫ్ లాక్‌డ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2024
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాబోయే రెండు నెలల్లో 'పుష్ప' సందడి మొదలవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా అంతా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప ది రూల్' (Pushpa The Rule). సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప ది రైజ్' (Pushpa The Rise) కు ఇది సీక్వెల్. ఈ చిత్రం డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది, అందుకే అభిమానులు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్‌ను ప్రకటించారు.'పుష్ప ఫస్ట్ హాఫ్ లాక్‌డ్'(Pushpa First Half Locked) అని తెలియజేస్తూ, ఈ విషయాన్ని పంచుకుంటూ "లాక్‌డ్ & లోడెడ్" అనే కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

వివరాలు 

రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పుష్ప - 2

ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్‌లో ఉంది. క్లైమాక్స్ అనంతరం, త్వరలో రెండో భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్