Page Loader
Chiranjeevi : 'చిరు - అనిల్ రావిపూడి' సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది!
'చిరు - అనిల్ రావిపూడి' సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది!

Chiranjeevi : 'చిరు - అనిల్ రావిపూడి' సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ పక్కా వినోదాత్మక చిత్రం రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, మెగాస్టార్‌ కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాలో క్లైమాక్స్‌ సన్నివేశాల కోసం భారీ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, నయనతారతో పాటు పలువురు కీలక నటులు ఈ భాగంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్‌ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది.

Details

ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకొనేలా సీన్స్

ఈ మేరకు వచ్చే వారం జరగనున్న షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారలపై కొన్ని ఫ్యామిలీ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల్లో కామెడీ ట్రాక్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. చిరు - నయనతార మధ్య వచ్చే హాస్యభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని చిత్రయూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇక ఇటీవల సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ.. "ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. అనిల్‌ రావిపూడి కొన్ని సన్నివేశాల గురించి చెప్పినప్పుడల్లా నేను కడుపుబ్బ నవ్వుతున్నాను. ఈ సినిమా అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని తెలిపారు.