Rana Daggubati: చట్టం తన పని తాను చేస్తుంది.. రానా దగ్గుబాటి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) చట్టపరమైన వ్యవహారాలపై తన వైఖరిని స్పష్టంగా తెలిపారు. మనమందరం చట్టాన్ని గౌరవించాలి. చట్టం తన పని తాను చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన ఒక ఈవెంట్ సందర్భంగా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్ట్ క్వాలిటీ, నిబంధనలు వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏ బ్రాండ్‌ను తాను ప్రమోట్ చేస్తానని రానా తెలిపారు. ఇటీవల బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో పాల్గొన్న పలువురు ప్రముఖులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ జాబితాలో రానా కూడా ఉన్నారు.
Details
వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్
ఈ కేసులపై నవంబరులో సీఐడీ SIT విచారణకు హాజరైన ఆయన చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే నేను ప్రచారం చేశానని విచారణ అనంతరం మీడియాతో చెప్పారు. మరోవైపు, నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రానా చురుకుగా ఉన్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా ఆయన నిర్మించిన 'కాంత' నవంబరులో విడుదల కాగా, అందులో రానా ఓ ముఖ్య పాత్ర పోషించారు. అలాగే శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర రూపొందిస్తున్న 'పరాశక్తి' చిత్రంలో కూడా ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.