Page Loader
KA 10 : దిల్ రూబా విడుదల తేదీ అనౌన్స్ చేసిన మేకర్స్ 
దిల్ రూబా విడుదల తేదీ అనౌన్స్ చేసిన మేకర్స్

KA 10 : దిల్ రూబా విడుదల తేదీ అనౌన్స్ చేసిన మేకర్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టాలెంటెడ్, హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త చిత్రం 'దిల్ రూబా'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది అతని కెరీర్‌లో 10వ సినిమాగా నిలవనుంది.ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ నిర్మాణ సంస్థ అయిన ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గతేడాది కిరణ్ అబ్బవరం "క" చిత్రంతో భారీ విజయాన్ని సాధించారు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో 'దిల్ రూబా' సినిమాను అధికారికంగా ప్రకటించారు. "క" చిత్రం విజయవంతమైన తరువాత వస్తున్న చిత్రంగా 'దిల్ రూబా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందుగా విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది.

వివరాలు 

మార్చి 14న విడుదల 

ప్రస్తుతం ఈ చిత్రాన్ని వాలెంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని యూనిట్ తొలుత నిర్ణయించగా, అనివార్య కారణాల వల్ల విడుదల తేదీని మారుస్తూ, మార్చి 14న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం మెకానికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 'కృషార్జున యుద్ధం' చిత్రంలో నటించిన రుక్సాన్ తిల్లాన్ ఈ సినిమా ద్వారా హిట్ అందుకుని, పరిశ్రమలో మళ్లీ బలమైన రీ-ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కిరణ్ సబ్బవరం చేసిన ట్వీట్