Page Loader
Mirzapur : మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌ను సినిమాగా తీసుకురానున్న మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌ను సినిమాగా తీసుకురానున్న మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

Mirzapur : మీర్జాపూర్ వెబ్‌సిరీస్‌ను సినిమాగా తీసుకురానున్న మేకర్స్.. రిలీజ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2024
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెబ్‌సిరీస్‌ ప్రేక్షకులను భాషలతో సంబంధం లేకుండా ఆకట్టుకుని, ఓటిటిలో సూపర్ హిట్‌గా నిలిచిన క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్ 'మీర్జాపూర్‌'. ఈ సిరీస్‌లోని ప్రధాన పాత్రలు, కథా వాస్తవాలు రెండు సీజన్లలో కూడా యూత్‌ని విశేషంగా అలరించాయి. ముఖ్యంగా దివ్యేందు పోషించిన 'మున్నా భయ్యా' పాత్ర అందరినీ ఆకర్షించింది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ మిలియన్ల వ్యూస్‌ సాధించి, బిగ్గెస్ట్ హిట్‌గా అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా మీర్జాపూర్ సిరీస్ గురించి మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్‌లో మూడు సీజన్లుగా ప్రసారమైన ఈ సిరీస్‌ను ఇప్పుడు మూడు గంటల సినిమాగా మార్చి విడుదల చేయనున్నారు.

Details

కిస్మస్ కానుకగా రిలీజ్

Amazon MGM స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పునీత్ కృష్ణ కథను అందిస్తుండగా, గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు సీజన్లలో కనిపించిన పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, హర్షిత శేఖర్ గౌర్ తదితర తారాగణం ఈ సినిమాలో కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఫ్యాన్స్‌కు ఈ సినిమా 2026 క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.