LOADING...
Nara Rohith: సినిమా సూపర్ హిట్.. శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
సినిమా సూపర్ హిట్.. శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్

Nara Rohith: సినిమా సూపర్ హిట్.. శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఫుల్ ఫాస్ట్ మీద ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన నటించిన సినిమా పాజిటివ్ టాక్ పొందుతోంది. సుందరకాండ అనే ఈ మూవీ ప్రేక్షకుల నుండి మంచి స్పందనతో దూసుకుపోతోంది. ఈ ఫేవరబుల్ టైమ్‌లో, రోహిత్ ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను తిరుగుతూ, అక్కడి ప్రేక్షకులను కలుసుకుని మూవీకి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. అలాగే ఈ సందర్భంలో ఆయన వినాయకుడి దర్శనాలు కూడా చేయడం విశేషం. తాజాగా, రోహిత్ వినాయకుడి దర్శనం చేసుకుని, అభిమానులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.

Details

తండ్రి మరణంతో పెళ్లి వాయిదా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మూవీతో ప్రేక్షకులను మెప్పించడం చాలా సంతోషంగా ఉంది. అందరి నుంచి వచ్చే పాజిటివ్ టాక్ నిజంగా ఆనందాన్ని ఇస్తోంది. ఈ రెస్పాన్స్ కోసం ఇంత వేచి చూశానని అన్నారు. సినిమా హిట్ అయిన తరువాత, రోహిత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. పెళ్లి అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ప్రారంభంలోనే ఉంటుందని ప్రకటించాడు. రోహిత్ ఇప్పటికే శిరీషతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, రోహిత్ తండ్రి మరణంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, రోహిత్ తన పెళ్లి కోసం రెడీ అవుతున్నారు.