
Telugu Cinema: క్లైమాక్స్ ట్విస్టుతో మెప్పించి.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ సినిమాలను చూశారా!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాకు క్లైమాక్సే ప్రధాన బలం. సినిమా మొదటి నుంచి చివరి వరకు మంచి వినోదాన్ని పంచి క్లైమాక్స్ లో వీక్ అయిపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది.
క్లైమాక్స్ బలంగా లేని చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని చవిచూశాయి.
అలాగే సినిమా మొత్తం నార్మల్ గా ఉండి క్లైమాక్స్ మాత్రం ఊహించని రీతిలో ఉంటే ఆ సినిమా బంపర్ హిట్ అవుతుంది. అలాంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి.
అయితే ప్రస్తుతం ఈ రెండు ఉదాహరణల్లోంచి కాకుండా, క్లైమాక్స్ లో ఊహించని మలుపుతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించిన కొన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం.
Details
రంగస్థలం
రంగస్థలం సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ జగపతిబాబు విలన్ అనుకుంటారు.
అసలు ప్రకాష్ రాజ్ విలన్ అవుతాడని ఎవరూ ఊహించరు. కానీ సడెన్ గా ప్రకాష్ రాజ్ లోని విలనిజాన్ని చూపించి షాక్ కి గురి చేస్తాడు దర్శకుడు.
రంగస్థలం సినిమా అందరికీ ఎంతలా నచ్చిందో క్లైమాక్స్ అంతకంటే ఎక్కువగా నచ్చింది.
విరూపాక్ష:
సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో 100కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం ఇదే.
మూఢనమ్మకాలు, మంత్ర తంత్రాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విలన్ ఎవరనేది చివరి వరకు తెలియదు.
చివర్లో హీరోయిన్ ని విలన్ గా చూపించి అందరికీ షాక్ ఇచ్చారు. సంయుక్తా మీనన్ ని విలన్ గా చూసి ప్రేక్షకులు ఉత్కంఠకు లోనయ్యారు.
Details
భాగమతి
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కనిపించిన భాగమతి చిత్రంలో విలన్ ఎవరనేది చివరి వరకు అర్థం కాదు. రాజకీయ నాయకుడైన జయరాం ని మంచివాడిగా చూపిస్తారు.
కాని చివర్లో జైలులో ఉన్న అనుష్క చేసే కొన్ని పనుల ద్వారా విలన్ గురించి అందరికీ తెలుస్తుంది. విలన్ గురించి తెలిసే సమయంలో వచ్చే సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ:
ఈ సినిమా ట్రైలర్ చూసినవాళ్లు హా.. ఏముంది, ఎవరో అమ్మాయి మిస్సయింది.. ఆమెను పట్టుకోవడమే కదా సినిమా అనుకుంటారు. కానీ సినిమా చూసినప్పుడు మాత్రం అందరూ థ్రిల్ కి గురవుతారు.
కిడ్నాప్ అయిన అమ్మాయిని వెతుక్కుంటూ గుర్తుతెలియని మృతదేహాల వైపు కథ మళ్ళుతుంది.
Details
కేరాఫ్ కంచరపాలెం
చాలా చిన్న సినిమాగా విడుదలై అటు విమర్శకుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ చిత్రం.
ఈ సినిమాలో నాలుగు కథలు కనిపిస్తుంటాయి. నాలుగు కథలు కూడా ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉంటాయి.
చివరికి వచ్చేసరికి ఆ నాలుగు కథలు ఒకరి జీవితంలో జరిగిన కథలే అని తెలుస్తుంది.
ఆర్ ఎక్స్ 100:
సాధారణంగా ప్రేమకథా చిత్రాలంటే హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు. చాలా సినిమాల్లో హీరోనే హీరోయిన్ ని మోసం చేస్తాడు.
మొదటిసారిగా ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ విలన్ గా కనిపిస్తుంది.
అసలు ప్రేమే లేకుండా కేవలం శరీర వాంఛ కోసమే హీరోకి హీరోయిన్ దగ్గరవుతుందని క్లైమాక్స్ లో తెలిసేసరికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.