Page Loader
SSMB29: పాస్‌పోర్ట్ వచ్చేసింది.. మహేశ్‌ని ఇక ఎవ్వరూ ఆపలేరు!
పాస్‌పోర్ట్ వచ్చేసింది.. మహేశ్‌ని ఇక ఎవ్వరూ ఆపలేరు!

SSMB29: పాస్‌పోర్ట్ వచ్చేసింది.. మహేశ్‌ని ఇక ఎవ్వరూ ఆపలేరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన వస్తువు మన చేతికి వచ్చేసినపుడు కలిగే ఆనందం వర్ణించలేనిది. ఇప్పుడు అలాంటి హప్పీనెస్‌లోనే ఉన్నాడు మన సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు. తాజాగా తన పాస్‌పోర్ట్‌ తిరిగి వచ్చిందని ఎయిర్‌పోర్ట్‌లో ఫొటోగ్రాఫర్లకు చూపిస్తూ సరదాగా హాస్యానికి తావిచ్చాడు. ఆ మూడుపాటి చిరునవ్వుతో పాస్‌పోర్ట్‌ చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రావెలింగ్ చేసే హీరోగా గుర్తింపు పొందిన మహేశ్‌ బాబు, ఈ మధ్య రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'SSMB29' కోసం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మూడు నెలల క్రితం రాజమౌళి మహేశ్‌ పాస్‌పోర్ట్‌ తన దగ్గర ఉందని చేసిన ఫన్నీ పోస్ట్‌ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండయ్యింది.

Details

ఒడిశాలో కీలక షెడ్యూల్ పూర్తి

ఇప్పుడు మహేశ్‌ ''పాస్‌పోర్ట్‌ వచ్చేసింది.. నన్నెవ్వరూ ఆపలేరు!'' అన్నట్టుగా కనిపించడంతో, మీమర్స్‌కు మళ్లీ పండగే పండగ అయ్యింది. ఇటీవల ఒడిశాలోని సిమిలిగుడ ప్రాంతం వద్ద ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తిచేశారు. మాలి, పుట్‌సీల్‌, బాల్డ వంటి లొకేషన్లలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రియాంకాతో కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని షూట్ చేసినట్టు సమాచారం. అంటే మహేశ్ బాబు పాస్‌పోర్ట్‌ లాండ్ అయ్యిందంటే.. ఇక కొత్త షెడ్యూల్‌కు మహేష్ రెడీ అన్నమాట!