
Rithu Chowdary: ఫోటోలు మార్ఫింగ్ చేసి నన్ను టర్చర్ చేశారు.. ఎమోషన్ అయిన రీతూ చౌదరి
ఈ వార్తాకథనం ఏంటి
జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారిలో రీతూ చౌదరి (Rithu Chowdary) ఒకరు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ డిఫెరెంట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. రీతూ అందానికి సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.
ఇటీవల ఇంటి నిర్మాణంలో ఒకరు మోసం చేశారంటూ తన యూట్యూబ్ ఛానల్లో వాపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో చేదు అనుభవాన్ని ఆమె పంచుకుంది.
తన వీడియోలు మార్ఫింగ్ చేసి, సైకో ఆనందంతో తనకే ట్యాగ్ చేసి టార్చర్ పెడుతున్నారని ఆమె వాపోయింది.
దీనిపై స్పందించాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయాయని పేర్కొంది.
బయటికి చెప్పడం వల్ల కొందరికే తెలిసిన విషయం అందరికి తెలిసిపోతుందా అని భయపడ్డానని రీతూ అన్నారు.
Details
నా ఫ్యామిలీ అండగా నిలిచింది : రీతూ చౌదరి
వీడియో లీక్డ్ అంటగా, వస్తావా అంటూ అసభ్యంగా కామెంట్ చేస్తున్నారని ఎమోషనల్ అయింది.
ఈ విషయంలో మా ఫ్యామిలీ, నా బాయ్ ఫ్రెండ్, విష్ణుప్రియ అండగా నిలిచారన్నారు.
వీడియో మార్ఫింగ్ చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టకున్నారని, అయితే అది అతను చేయలేదు అంటూ నాటకాలు ఆడుతున్నారని తెలిపింది.
అయితే అతని తరుపున వచ్చినవాళ్లు కూడా పాపం చిన్నపిల్లాడు వదిలేయండి అని మాట్లాడారన్నారు.
అందరికి ఇలాంటి వాళ్ల గురించి తెలియాలనే ఉద్ధేశంతో ఈ వీడియో చేశానని రీతూ పేర్కొంది.