Page Loader
Kanguva: సూర్య 'కంగువా'లో ఏఐతో ప్రయోగం చేశాం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత జ్ఞానవేల్! 
సూర్య 'కంగువా'లో ఏఐతో ప్రయోగం చేశాం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత జ్ఞానవేల్!

Kanguva: సూర్య 'కంగువా'లో ఏఐతో ప్రయోగం చేశాం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత జ్ఞానవేల్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2024
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

శివ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కంగువా'. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ ఫాంటసీ యాక్షన్‌ చిత్రం గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 'కంగువా'ని 8 భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిసింది. నిర్మాత జ్ఞానవేల్‌ మాట్లాడుతూ తమిళ వెర్షన్‌కు సూర్య స్వయంగా డబ్బింగ్‌ చెప్పాడని, కానీ మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కోలీవుడ్‌లో డబ్బింగ్‌ కోసం ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారి.

Details

ఫ్రెంచ్, స్పానిష్ లో విడుదలకు సన్నాహాలు

గతంలో 'వేట్టయన్‌'లో అమితాబ్ బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఈ సాంకేతికతను ఉపయోగించారు. ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్‌లో కూడా విడుదల కానుంది. చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలో ప్రకటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్ట్ 2, పార్ట్ 3 కథలను కూడా సిద్ధం చేశారు. మొదటి పార్ట్‌ విజయంపై ఆధారపడి వాటిని తెరకెక్కించే ప్రణాళికలు ఉంటాయన్నారు. ఈ చిత్రం సూర్యని మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా రూపొందించినట్లు నిర్మాత జ్ఞానవేల్‌ తెలిపారు.

Details

కథానాయికగా దిశా పఠానీ

యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఈ చిత్రంలో అధిక ప్రాధాన్యత ఉండనుందని చెప్పారు. కంగ అనే పరాక్రముడిపై కథనం ఉండగా, ఇందులో సూర్య ఆరు భిన్న అవతారాల్లో కనిపించనున్నాడు. దిశా పఠానీ, కథానాయికగా, బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో ఉంటున్నారు.