
Sushmita Konidela : మా గొడవలకి కారణం పవన్ బాబాయే.. చిరంజీవి కూతురు సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్‌కు ఈ జనరేషన్ కజిన్స్‌తో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. పవన్ తన కెరీర్ ప్రారంభించే వరకు ఇంట్లోని పిల్లలందర్నీ తానే చూసుకునేవాడని, దీనిపై పవన్, చిరంజీవి, రామ్ చరణ్ పలు సందర్భాల్లో చెప్పిన విషయమే దీనికి నిదర్శనం. అందువల్ల మెగా ఫ్యామిలీలోని పిల్లలందరికీ పవన్ చాలా క్లోజ్‌గా ఉంటారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఆమె తన నిర్మాణ సంస్థలో ప్రస్తుతం చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా నిర్మిస్తున్నారు. తాజాగా సుస్మిత ఓ టీవీ షోకు గెస్ట్‌గా హాజరయ్యారు.
Details
చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సుస్మితా
ఈ సందర్భంగా, పవన్ కళ్యాణ్ బాబాయి గురించి మీ అనుబంధం, ఏదైనా ఆసక్తికరమైన విషయం చెప్పమని అడిగారు. దీనికి స్పందించిన సుస్మిత మాట్లాడుతూ మేమంతా చిన్నప్పటి నుంచే బాబాయ్‌తో కలిసి పెరిగాము. నాకు, చరణ్‌కి మధ్య పెద్దగా గొడవలు ఉండేవి కావు. మేము బాగా కలిసే ఉండేవాళ్లం. కానీ మా ఇద్దరికీ గొడవలు వస్తే, అవి బాబాయ్ వల్లే వచ్చేవి. అప్పట్లో టీవీలో ఇంత ఎంటర్టైన్‌మెంట్ ఉండేది కాదు. ఆయనకు బోర్ కొట్టినప్పుడల్లా, నాకు - చరణ్‌కి మధ్య ఏదో ఒకటి వదులుతారు. అలా మేము ఇద్దరం కొట్టుకుంటుంటే, ఆయన చూసి ఎంజాయ్ చేస్తూ కూర్చునేవారని నవ్వుతూ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.