
Sri vishnu : శ్రీ విష్ణు 'సింగిల్' విడుదలకు ముహూర్తం ఖరారు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ఒకరు.
కెరీర్ ప్రారంభంలో సహాయ పాత్రలతో అడుగుపెట్టి, తన నాటకీయ నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, త్వరలోనే హీరోగా తనదైన ముద్ర వేసాడు.
వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించాడు. ఇటీవల శ్రీ విష్ణు, ఆసిత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్వాగ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, శ్రీ విష్ణు నటనకు మాత్రం విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.
Details
హీరోయిన్ గా కేతిక శర్మ
ఆయన పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం శ్రీ విష్ణు 'సింగిల్' అనే తాజా సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.
సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో మరియు సింగిల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇక తాజాగా ఈ సినిమా అధికారిక విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 9న 'సింగిల్' సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.