Page Loader
Sivakarthikeyan: విప్లవం ప్రారంభమైంది.. SK25 ప్రీ లుక్‌తో శివకార్తికేయన్ సూపర్బ్

Sivakarthikeyan: విప్లవం ప్రారంభమైంది.. SK25 ప్రీ లుక్‌తో శివకార్తికేయన్ సూపర్బ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి, సుధా కొంగర డైరెక్షన్‌లో రాబోయే ఎస్‌కే 25 (SK25). పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ప్రీ లుక్ రూపంలో బయటకొచ్చింది. విప్లవం ఎవరి కోసం వేచి ఉండదు.. విప్లవానికి రేపు నాంది పలుకబోతున్నాం అంటూ శివకార్తికేయన్ సీసాకు మంటలంటిస్తున్న ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ టీజర్ రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల కానుందని తెలిపారు. ప్రీ లుక్ ఆధారంగా, ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరికొత్త కాన్సెప్ట్‌ను తెరపై తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది.

Details

విలన్ పాత్రలో జయం రవి

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, జయం రవి, అధర్వ మురళి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సంగీతాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తున్నారు. ఇప్పటికే శివకార్తికేయన్ ఎస్‌కే 25 గురించి మాట్లాడుతూ, ప్రోమో షూట్ పూర్తి చేశామని తెలిపారు. జయం రవి విలన్‌గా నటించడం ఆనందంగా ఉందని, ఇది చాలా పవర్‌ఫుల్ రోల్ అని చెప్పారు. తన కాలేజీ రోజుల్లో జయం రవి సినిమాలు చాలా చూశానని చెప్పారు. ఆయన నా సీనియర్ అని, ఆయనతో నటిస్తుందనందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉందని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.