
Mass Jathara: 'మాస్ జాతర' నుంచి రెండో పాట.. రేపే 'ఒలే ఒలే' ప్రోమో విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజ రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర' మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బ్యానర్లు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 27న థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ వరుసగా ప్రమోషనల్ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తాజా అప్‌డేట్ ఇచ్చింది. చిత్రం నుంచి 'సెకండ్ సింగిల్' ప్రకటన వచ్చింది.
Details
ఆగస్టు 4న రిలీజ్
ఒలే ఒలే అనే పాట ప్రోమోను ఆగస్టు 4న ఉదయం 11:08 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇక పూర్తి లిరికల్ సాంగ్‌ను ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ, చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఓవర్‌ఆల్‌గా చూస్తే, మాస్ జాతర మూవీ ప్రమోషన్లతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.