Page Loader
Vijay Sethupathi: షూటింగ్‌కు రంగం సిద్ధం.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త ప్రయోగం!
షూటింగ్‌కు రంగం సిద్ధం.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త ప్రయోగం!

Vijay Sethupathi: షూటింగ్‌కు రంగం సిద్ధం.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త ప్రయోగం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ వెర్సటైల్ యాక్టర్‌ విజయ్ సేతుపతి, టాలీవుడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ కొత్త పాన్ ఇండియన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో టబుతో పాటు కన్నడ నటుడు విజయ్ కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Details

జూన్‌లో షెడ్యూల్‌ స్టార్ట్

ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ బయటపెట్టారు. జూన్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. షూటింగ్‌ లొకేషన్ల ఎంపిక కోసం యూనిట్ హైదరాబాద్‌తో పాటు చెన్నైలో రెక్కీ కార్యక్రమాన్ని జరుపుతోందని వెల్లడించారు. తొలి షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి, టబు సహా ప్రధాన తారాగణం పాల్గొననున్నారు.

Details

టైటిల్‌ బిగ్ టాక్‌లో!

ఈ చిత్రానికి 'బెగ్గర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఐదు భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో అన్ని భాషలకూ సూటయ్యేలా టైటిల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. విజయ్ సేతుపతి పాత్రకు సంబంధించి... గతంలో ఎప్పుడూ చూడని ఓ న్యూ లుక్, మల్టీపుల్ వేరియేషన్లు ఉంటాయని చెబుతున్నారు. ఐదు భాషల్లో విడుదల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ... ఛార్మీతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది

Details

 ఫ్లాప్‌ల నుంచి బయటపడాలని గట్టి నిర్ణయం 

ఇదే సమయంలో పూరి జగన్నాథ్ గత చిత్రాలు 'లైగర్', డబుల్ ఇస్మార్ట్ వాణిజ్య పరంగా తీవ్రంగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు పెట్టిన బడ్జెట్‌కు సగం కూడా రికవరీ చేయలేకపోయాయి. ఈ ఫ్లాప్‌ల ప్రభావం పూరి మీద తీవ్రంగా పడిందన్న ప్రచారం కూడా జరిగింది. విజయ్ సేతుపతితో ప్రయోగం! లైగర్ తర్వాత విజయ్ దేవరకొండతో *జనగణమన* అనే చిత్రం ప్రకటించినా, ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. తెలుగు హీరోలు పూరితో జట్టుకట్టడానికి ఆసక్తి చూపకపోవడంతో ఆయన దృష్టి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిపై పడిందన్న ప్రచారం ఉంది. ఈ ప్రయోగాత్మక కాంబినేషన్‌తో వస్తున్న కొత్త పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.