Kanima Song: సూర్య 'రెట్రో' నుంచి 'కనిమా' సాంగ్ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ నటుడు సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం 'రెట్రో' యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది.
ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా, మలయాళ నటుడు జోజు జార్జ్, కరుణకరణ్, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఈ వేసవి కానుకగా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు.
'రెట్రో' నుంచి 'కన్నమ్మ' అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఈ గీతంలో, సూర్య - పూజా జంట అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Details
వేసవిలో రెట్రో విడుదల
గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఓ ప్రేమికుడి కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో, అతని ప్రేయసి అతడిని ఎలా మారుస్తుంది? తన ప్రేమ కోసం హీరో ఏం చేస్తాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందింది.
ఈ చిత్రాన్ని సూర్య తన భార్య జ్యోతికతో కలిసి తమ స్వంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా సూర్య అభిమానులకు ఈ వేసవిలో వినోదాన్ని పంచనుంది.