Page Loader
Darshan: రేణుకా స్వామి ఆత్మ నన్ను వెంటాడుతోంది.. జైలులో నటుడు దర్శన్ అవేదన
రేణుకా స్వామి ఆత్మ నన్ను వెంటాడుతోంది.. జైలులో నటుడు దర్శన్ అవేదన

Darshan: రేణుకా స్వామి ఆత్మ నన్ను వెంటాడుతోంది.. జైలులో నటుడు దర్శన్ అవేదన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2024
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ నటుడు దర్శన్‌ ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, రేణుకాస్వామి ఆత్మ తనను కలలో వేధిస్తోందని జైలు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శన్‌ భయంతో తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, బెంగళూరు జైలుకు తనను తరలించాలని కోరినట్లు తెలుస్తోంది. జైలులో అర్ధరాత్రి సమయంలో దర్శన్‌ నిద్రలో కలవరపడుతూ గట్టిగా కేకలు వేస్తున్నాడని, అతడి అరుపులతో జైలు సిబ్బంది సైతం చలించిపోయినట్లు తోటి ఖైదీలు చెబుతున్నారు.

Details

దర్శన్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ

రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపింది. చిత్రహింసలకు గురి చేసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో దర్శన్‌తో పాటు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. విచారణలో రేణుకాస్వామిని నిందితులు పాశవికంగా కొట్టారని, కరెంట్‌ షాకులు పెట్టినట్లు కూడా వెల్లడైంది. ఈ నేపథ్యంలో దర్శన్ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. దీంతో ఇది మరింత ఉత్కంఠను రేపుతోంది.