Page Loader
NTR Neel: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీకి కథ ఖరారు.. హీరోయిన్ కూడా ఫైనల్!
ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీకి కథ ఖరారు.. హీరోయిన్ కూడా ఫైనల్!

NTR Neel: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీకి కథ ఖరారు.. హీరోయిన్ కూడా ఫైనల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 01, 2024
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' చిత్రంతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా నిర్మిస్తున్నారు. దీంతో ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఎన్‌టీఆర్ 31' అనే కొత్త ప్రాజెక్ట్‌ని కూడా ఎన్టీఆర్ ప్రకటించడం ద్వారా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ ఆగస్టులో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

Details

బంగ్లాదేశ్ నేపథ్యంలో కథ

ఎన్‌టీఆర్ నీల్‌గా పిలవనున్న ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో 'సప్తసరాగాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది, దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమా బంగ్లాదేశ్ నేపథ్యంతో సాగే కథగా ఉండనున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు ప్రజలకు అండగా నిలిచే పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని చెబుతున్నారు.