Page Loader
Mirai : అదిరిపోయిన 'మిరాయ్' టీజర్.. విజువల్స్ ఊహలకు మించి!

Mirai : అదిరిపోయిన 'మిరాయ్' టీజర్.. విజువల్స్ ఊహలకు మించి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

'హనుమాన్'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తేజ సజ్జ, మళ్లీ అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి 'మిరాయ్' అనే పాన్ వరల్డ్ మూవీతో వస్తున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కొద్దిగా సమయం తీసుకున్నా, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒక్కో పోస్టర్‌ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ రోజు మేకర్స్‌ రిలీజ్ చేసిన టీజర్‌ను చూస్తే.. నిజంగా ఆశ్చర్యపోయే విధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ టీజర్ ప్రేక్షకులను ఓ వింత ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది.

Details

పవర్ పుల్ లుక్ లో మంచు మనోజ్

ఇండియన్ సినిమాల్లో భారీ విజువల్స్‌తో వస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి కానీ, కంటెంట్‌కు తగ్గట్టుగా ఉండే గ్రాఫిక్స్ వుంటేనే సినిమాకు ఊపొస్తుంది. ఆ కోణంలో చూస్తే 'మిరాయ్' అసాధారణంగా ఉంది. టీజర్‌లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. మంచు మనోజ్ పాత్రను చూస్తే పవర్‌పుల్‌గా, ఆగ్రెసివ్‌గా కనిపిస్తున్నారు. అలాగే తేజ సజ్జ ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఈసినిమా ఇండియన్ సినిమాకు ఒక నూతన దిశగా దారి తీసేలా ఉంది. టీజర్ చివర్లో రాముని రాకను చూపించిన విజువల్ మాత్రం ఎమోషన్, గ్రాండియర్‌కు ఒక సరైన ఉదాహరణగా నిలిచింది. మొత్తంగా 'మిరాయ్' టీజర్‌ చూస్తుంటే, తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు.