Loading...
Ramaprabha: రమాప్రభ జీవితంలోని తీపి, చేదు జ్ఞాపకాలు.. 'ఇదేనండి నా కథ'గా ఆవిష్కరణ
రమాప్రభ జీవితంలోని తీపి, చేదు జ్ఞాపకాలు.. 'ఇదేనండి నా కథ'గా ఆవిష్కరణ

Ramaprabha: రమాప్రభ జీవితంలోని తీపి, చేదు జ్ఞాపకాలు.. 'ఇదేనండి నా కథ'గా ఆవిష్కరణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సీనియర్‌ నటి రమాప్రభ జీవిత ప్రయాణం ఇప్పుడు పుస్తక రూపంలోకి వచ్చింది. 'రమాప్రభ.. ఇదేనండి నా కథ' పేరుతో ఈ పుస్తకం వెలువడింది. ఆమె 81వపుట్టినరోజు సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని బసినకొండ పంచాయతీ, గంగన్నగారిపల్లెలో ఉన్న రమాప్రభ నివాసంలో ఈపుస్తకాన్ని ఆవిష్కరించారు. స్థానిక ప్రముఖులు, అభిమానులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న రమాప్రభ ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు జింకల మోహనవల్లి.. ఏడాది పాటు రమాప్రభను ఒప్పించి ఈ పుస్తకాన్ని రచించారు. చాలామంది తమ ఆత్మకథలను తామే రాసుకుంటారని.. అయితే తన జీవిత కథను మరొకరు రాయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రమాప్రభ తెలిపారు.

వివరాలు

1400 పైగా సినిమాల్లో నటన

తన పుట్టినరోజునే ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని రచయిత్రి మోహనవల్లి పేర్కొన్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో రమాప్రభ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 1,400కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఈపుస్తకంలో ఆమె సినీ జీవితంలోని ఎత్తుపల్లాలతో పాటు.. వ్యక్తిగత జీవితంలోని తీపి, చేదు జ్ఞాపకాలను కూడా పొందుపరిచారు.

'చిత్రజ్యోతి' కథనం ప్రకారం.. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నవలా రచయిత టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి, యాదవల్లి భారతితో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, రమాప్రభ అభిమానులు హాజరయ్యారు.

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నాటి నుంచి ప్రస్తుతం మదనపల్లెలో ప్రశాంత జీవనం గడుపుతున్న నేటి వరకు రమాప్రభ సాగించిన ప్రయాణాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది.

ADVERTISEMENT