Page Loader
Samantha: 'కాఫీ విత్ కరణ్' షోలోనే మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డాయి : సమంత
'కాఫీ విత్ కరణ్' షోలోనే మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డాయి : సమంత

Samantha: 'కాఫీ విత్ కరణ్' షోలోనే మయోసైటిస్ లక్షణాలు బయటపడ్డాయి : సమంత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో తన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వ్యాధి లక్షణాలు మొదట కనిపించినప్పుడు తాను ఎంత కష్టపడ్డానో ఆమె గుర్తుచేసుకున్నారు. తాను 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొన్నప్పుడు తన శరీరం మొత్తం నీరసంగా అనిపించిందని, ఓపిక లేకపోయినా షోను పూర్తి చేసి హైదరాబాద్‌ చేరుకున్నానని పేర్కొంది. ఆ సమయంలో కరణ్‌తో తాను ఎంతో ప్రశాంతంగా ఉన్నానని, కానీ ఆ ప్రశాంతత ఎంతోకాలం నిలవలేదన్నారు. మరుసటి రోజు 'ఖుషి' షూటింగ్‌ సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డానని, తన శరీరం పూర్తిగా షట్‌డౌన్ మోడ్‌లోకి వెళ్లిపోయిందన్నారు. అప్పటి నుంచి ఆరోగ్యం మరింత క్షీణించిందని సమంత తెలిపింది.

Details

వ్యాధిని గుర్తించడానికి చాలా సమయం పట్టింది

వ్యాధిని గుర్తించడం కూడా చాలా సమయం పట్టిందని, ఆ తర్వాత ఎదురైన సవాళ్లు అందరికీ తెలిసిందేనని ఆమె వెల్లడించారు. 2022లో అక్షయ్‌కుమార్‌తో కలిసి 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొన్న సమంత, తన విడాకుల గురించి తొలిసారిగా మాట్లాడారు. ప్రస్తుతం సమంత నటించిన 'సిటాడెల్: హనీ బన్ని' వెబ్‌సిరీస్‌ అమెజాన్‌లో ప్రసారం అవుతోంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఆమె 'మా ఇంటి బంగారం' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌ పతాకంపై నిర్మితం కానుంది.