LOADING...
Karuppu : త్రిష-సూర్య కాంబోలో వస్తున్న 'కరుప్పు' టీజర్ అదిరింది.. రుద్రుడై దిగి వచ్చాడు హీరో!

Karuppu : త్రిష-సూర్య కాంబోలో వస్తున్న 'కరుప్పు' టీజర్ అదిరింది.. రుద్రుడై దిగి వచ్చాడు హీరో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'కరుప్పు' షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తుండగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాశ్ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో యోగి బాబు, శశివాద, నట్టి సుబ్ర‌మణ్యం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే జూలై 23న హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా 'కరుప్పు' టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు ప్రత్యేక బర్త్‌డే ట్రీట్ అందించింది.

Details

ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న టీజర్

టీజర్ ప్రారంభంలోనే కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగి వచ్చే దేవుడు అనే పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత "నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరు ఉంది", "ఇది నా టైమ్..." వంటి డైలాగ్‌లు సూర్య స్టైల్లో దుమ్ము రేపాయి. యాక్షన్ సన్నివేశాలు బాగా డిజైన్ చేశారు. మొత్తం ఒక నిమిషం 42 సెకన్ల పాటు నడిచిన ఈ టీజర్ ఫాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్‌ నుంచే భారీ అంచనాలు ఏర్పడిన ఈ చిత్రం, సూర్య నటన, డైలాగ్ డెలివరీతో మరో హిట్ ఖాయం అంటున్నాయి అభిమానులు.