LOADING...
Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే?
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే?

Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 03, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు', చాలా రోజుల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ తరహా చిత్రాలకు సాధారణంగా కనీసం రెండు నెలల ముందు నుంచే భారీగా ప్రచారం మొదలవుతుంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు దాదాపు అస్పష్టంగా ఉన్నాయి. జూన్ 12న సినిమా విడుదల కానున్నా, ఇప్పటికీ ట్రైలర్ విడుదల కాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. విడుదలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంది.

Details

ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అభిమానుల్లో ఉత్కంఠ

ఇంకా ట్రైలర్‌ లేకపోవడం వల్ల సినిమా పట్ల సాధారణ ప్రేక్షకుల్లో ఆసక్తి కొంత తగ్గినట్టు సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా, ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అనే ఉత్కంఠ కూడా అభిమానుల్లో నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ వారాంతంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 8న తిరుపతిలోని ఎస్‌వీయూ తారకరామ క్రీడా మైదానంలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ జూన్ 7న తిరుపతి చేరుకొని, శ్రీవారి దర్శనం అనంతరం ఈవెంట్‌కి హాజరుకానున్నారని సమాచారం.

Details

ముంబైలో ఓ ప్రమోషన్ చేసే అవకాశం

ఇటీవల చెన్నైలో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత, మేకర్స్ ఈ పీరియాడిక్ చిత్రాన్ని మరింత ఘనంగా ప్రెజెంట్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో, ఇతర పెద్ద సినిమాల్లా విస్తృత ప్రమోషన్లు చేయలేకపోతున్నారు. అందువల్ల తక్కువ సమయాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ప్రచార కార్యాచరణను మినిమల్ కానీ లక్ష్యబద్ధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ముంబైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్, వారణాసిలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచనలు కూడా ఉన్నప్పటికీ, సమయాభావం కారణంగా వాటిని వదిలేసినట్టు సమాచారం. అయితే ముంబై ప్రమోషన్‌ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోనట్టు తెలుస్తోంది.