Aadarshakutumbam: చిట్టిబాబు పాత్రలో వెంకటేశ్.. 'ఆదర్శ కుటుంబం'పై ఆసక్తి పెంచిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47'. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను విడుదల చేశారు. 'ఆదర్శ కుటుంబం' ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే సమయం వచ్చిందని ప్రకటించిన చిత్రబృందం, జులై 27న ప్రత్యేక అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనే వివరాలను కూడా వెల్లడించింది.
వివరాలు
ఇద్దరు పిల్లలకు తండ్రిగా వెంకటేష్..
ఈ చిత్రంలో చిట్టిబాబు అనే పాత్రలో ఇద్దరు పిల్లలకు తండ్రిగా వెంకటేష్ కనిపించనున్నారు.
శ్రీనిధి శెట్టి స్వర్ణ పాత్రను పోషిస్తుండగా, యువిన పార్వతి సంపూర్ణ, రాజ్ ప్రజ్వల్ శర్వా పాత్రల్లో నటిస్తున్నారు.
జులై 27న సినిమా కథ, పాత్రలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడయ్యే అవకాశముంది.
ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ ఇప్పటికే ప్రకటించారు.
వివరాలు
అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం..
కుటుంబ భావోద్వేగాలకు యాక్షన్‌ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇందులో వెంకటేశ్ మధ్యతరగతి కుటుంబానికి పెద్దగా కనిపించనున్నారు.
గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా, పూర్తి స్థాయి సినిమా కోసం ఈ ఇద్దరి కలయికను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక 'ఆదర్శ కుటుంబం'తో నెరవేరబోతోంది.