తదుపరి వార్తా కథనం

Actor Suhas: తండ్రి అయిన టాలీవుడ్ నటుడు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 22, 2024
05:30 pm
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటుడు సుహాస్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన భార్య నాగ లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.
బాబుని ఎత్తుకున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా, సుహాస్ ది లవ్ మ్యారేజ్.
దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకొని, 2017లో లలితని పెళ్లి చేసుకున్నారు.
ఇక, సుహాస్ కమెడియన్ గా,సపోర్టింగ్ ఆర్టిస్టుగా,విల్లన్ గా, హీరోగా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.
ఓటీటీలో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీలోని అతడి పాత్ర, నటనతో ఆకట్టుకున్నాడు. ఆ వెంటనే కలర్ ఫొటో సినిమాలో ఫీచర్ హీరోగా మారాడు.