తదుపరి వార్తా కథనం
Devara: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 10, 2024
06:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పాటలకు ప్రేక్షకుల నుండి అదరిపోయే స్పందన లభించింది.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.
ఈ ట్రైలర్ ను చూసిన అభిమానులు ఈసారి హిట్ పక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 27న రిలీజ్ కానుంది.