Page Loader
Narakasura Trailer : యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలతో 'నరకాసుర' ట్రైలర్ వచ్చేసింది 
యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలతో 'నరకాసుర' ట్రైలర్ వచ్చేసింది

Narakasura Trailer : యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలతో 'నరకాసుర' ట్రైలర్ వచ్చేసింది 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 24, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

పలాస మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం 'నరకాసుర'. సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ మేకర్స్ లాంచ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే మరోసారి 'పలాస' తరహాలో రా అండ్ రస్టిక్ సినిమాతో రక్షిత్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రక్షిత్ అట్లూరి ఓ వైపు లారీ డ్రైవర్, మరోవైపు శత్రువులను చీల్చి చెండాడే వ్యక్తిగా డ్యుయల్ షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కట్‌ చేసిన ట్రైలర్‌ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Details

నవంబర్ 3న 'నరకాసుర' రిలీజ్

"నువ్వు నిర్మించకున్న ఈ ప్రపంచంలో అంతా నీవాళ్లే. బయట ప్రపంచానికి మాత్రం నువ్వు అనాధవే. కొన్నిసార్లు దేవుళ్ళు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది" వంటి డైలాగ్స్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నాజర్‌, శత్రు, శ్రీమాన్‌ ఇతర నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్‌ బ్యానర్లపై అజ్జా శ్రీనివాస్‌, కరుమూరు రఘు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్ 3న థియోటర్స్‌లో విడుదల చేయనున్నారు.