తదుపరి వార్తా కథనం
RRR Behind And Beyond Trailer: రాజమౌళి మాస్టర్‌పీస్ 'ఆర్‌ఆర్‌ఆర్'పై డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 17, 2024
05:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' మరోసారి వార్తల్లో నిలిచింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విజువల్ వండర్‌లో బాలీవుడ్ నటి అలియా భట్ కీలక పాత్ర పోషించింది.
2021లో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది.
తాజాగా ఈ చిత్రంపై డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా జక్కన్న టీమ్ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 20 నుంచి ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల కానుంది. ఈ ట్రైలర్ ఇప్పటికే సినీ ప్రేమికుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది.