తదుపరి వార్తా కథనం
Mrunal Thakur: అప్పుడు ధనుష్, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్… రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 01, 2025
03:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న రూమర్స్‌పై నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)కీలక వ్యాఖ్యలు చేశారు. ఈప్రచారాలు పూర్తిగా నిరాధారమని, ఇలాంటి వార్తలు వినడమే హాస్యాస్పదంగా ఉంటుందని ఆమె తెలిపారు. 'వాళ్లు ఇలా వార్తలు సృష్టిస్తుంటారు. నేను చూసి నవ్వుకుంటాను. ఇవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్స్ మాత్రమేనని సోషల్ మీడియా ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో తనపై జరుగుతున్న ప్రచారాలకు మృణాల్ గట్టి చెక్ పెట్టినట్టైంది. ఇంతకు ముందు ఆమెపై ఇలాంటి గాసిప్స్ వచ్చాయి. ముఖ్యంగా నటుడు ధనుష్(Dhanush)తో రిలేషన్‌లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను అప్పుడే మృణాల్ ఖండిస్తూ, ధనుష్ తనకు మంచి స్నేహితుడేనని స్పష్టం చేశారు.