Page Loader
Sunny Deol: 'బాలీవుడ్‌లో ఒరిజినల్‌ కథలు తక్కువ.. రీమేక్‌లే ఎక్కువ : సన్నీదేవోల్‌ కీలక వ్యాఖ్యలు 
'బాలీవుడ్‌లో ఒరిజినల్‌ కథలు తక్కువ.. రీమేక్‌లే ఎక్కువ : సన్నీదేవోల్‌ కీలక వ్యాఖ్యలు

Sunny Deol: 'బాలీవుడ్‌లో ఒరిజినల్‌ కథలు తక్కువ.. రీమేక్‌లే ఎక్కువ : సన్నీదేవోల్‌ కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 02, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ నటుడు సన్నీదేవోల్‌ (Sunny Deol) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా విషయంలో అనవసరమైన అభిప్రాయాలు పెరిగిపోతున్నాయని, దానివల్ల కథ అనుకున్నట్టుగా స్క్రీన్‌పై ప్రతిబింబించడంలేదని తెలిపారు. కథే కింగ్‌, దర్శకుడే బాస్‌ తాజా ఇంటర్వ్యూలో సన్నీదేవోల్‌ మాట్లాడారు. ప్రస్తుతం సినిమాలపై సరైన అభిరుచి తగ్గిపోయింది. గతంలో మాదిరిగా మంచి కథా చిత్రాలను రూపొందించాలనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకానొక సమయంలో దక్షిణాది చిత్ర పరిశ్రమలు బాలీవుడ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాయి. కానీ ఇప్పుడు వాళ్లు మమ్మల్ని దాటి ముందుకు వెళ్తున్నారు. అందుకే మనం వాళ్ల సినిమాలను రీమేక్‌ చేస్తున్నాం.

Details

 బాలీవుడ్‌ కంటే దక్షిణాది సినిమాలదే హవా 

చాలామంది కలిస్తే వంట పాడవుతుందని, అదే సమస్య ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఉంది. సినిమా విషయంలో కథే ఎప్పటికీ కింగ్‌. దర్శకుడే బాస్‌. కానీ, ఇప్పుడిదే అసలు సమస్య. ప్రతీ ఒక్కరూ జోక్యం చేసుకుంటున్నారు. వారి అభిప్రాయాలు చెప్పడం వల్ల కథ అసలు మూలరూపాన్ని కోల్పోతుందని అన్నారు. ప్రేక్షకులు మంచి కథలను మాత్రమే ఆదరిస్తున్నారని, అలాంటి కథలు బాలీవుడ్‌లో తగ్గిపోతున్నాయని సన్నీదేవోల్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు మనసును హత్తుకునే కథల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, అలాంటి కథలు ఇప్పుడు బాలీవుడ్‌లో రావడం లేదని వాపోయారు.

Details

 'జాట్‌' సినిమా హిట్‌ గ్యారంటీ!

అనంతరం తన తదుపరి చిత్రం 'జాట్‌' గురించి సన్నీదేవోల్‌ వివరించారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని, మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో దీన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సయామీ ఖేర్‌, రెజీనా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 10న థియేటర్లలో విడుదల కానుంది.