
Sreeleela : ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదు.. శ్రీలీల క్లారిటీ కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గ్లామర్, ఎనర్జీటిక్ డ్యాన్స్, లైవ్లీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న యాక్ట్రెస్ శ్రీలీల. భాషాపరమైన భేదాలు లెక్కచేయకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రైవేట్ లైఫ్, పెళ్లి పై ప్లాన్లు, ప్రేమ గాసిప్స్‌పై ఓపెన్‌గా మాట్లాడింది. శ్రీలీల మాట్లాడుతూ ఇప్పుడు నా వయసు 24 మాత్రమే. కెరీర్ ఈ స్టేజీలో మొదలైంది. 30 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ప్రస్తుతానికి పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేస్తున్నాను. ప్రైవేట్ లైఫ్ గురించి ఆలోచించే టైమ్ కూడా లేదని చెప్పింది. తన ప్రేమ జీవితంపై వస్తున్న గాసిప్స్ విషయంలో మాత్రం శ్రీలీల పూర్తి క్లారిటీ ఇచ్చింది.
Details
గాసిప్స్ ను నమ్మకండి
నిజంగా నేను ఎవరితోనైనా రిలేషన్‌లో ఉంటే... మాతో మా అమ్మ ఉండగలదా? నేను ఎక్కడికెళ్లినా ఆమె నా వెంటే ఉంటుంది. అమెరికా వెళ్లినప్పుడు కూడా అమ్మ నాతోనే వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రేమలో పడటం అసాధ్యమే. ఇప్పటికైతే నా కెరీర్‌కే ప్రాధాన్యత. పెద్ద సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకుల మద్దతు పొందేందుకు కష్టపడుతున్నానని వివరించింది. ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు ఎంత ఫేమస్ అయినా మామ్స్ బేబీయే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మీడియాలో వచ్చే గాసిప్స్‌కి తాను అటెంప్ట్ ఇవ్వకుండా ఉంటానని శ్రీలీల స్పష్టం చేసింది.
Details
టాప్ హీరోయిన్‌గా ఎదగాలన్నదే లక్ష్యం
ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొని, ప్రాజెక్టుల ఎంపికలో జాగ్రత్తగా ఉంది. కెరీర్‌ను నిలబెట్టుకోవడమే తాను ఫోకస్ చేస్తున్న ఏకైక అంశమని చెప్పిన శ్రీలీల, తన వ్యక్తిగత జీవితం గురించి వదంతులపై పూర్తిగా లైట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.