Loading...
Rashmika-Vijay Deverakonda:పెళ్లి తర్వాత పెద్దగా మార్పేం రాలేదు.. విజయ్‌ చాలా సున్నితమైన వ్యక్తి: రష్మిక
పెళ్లి తర్వాత పెద్దగా మార్పేం రాలేదు.. విజయ్‌ చాలా సున్నితమైన వ్యక్తి: రష్మిక

Rashmika-Vijay Deverakonda:పెళ్లి తర్వాత పెద్దగా మార్పేం రాలేదు.. విజయ్‌ చాలా సున్నితమైన వ్యక్తి: రష్మిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండను పెళ్లాడిన తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదని నటి రష్మిక మందన్న తెలిపారు. కెరీర్ పతాకస్థాయిలో ఉన్న సమయంలో వివాహం చేసుకున్నప్పటికీ.. తన ప్రయాణం మాత్రం యథావిధిగానే కొనసాగుతోందని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'మేమిద్దరం కలిసే ఎదిగాం. తోటి నటులుగా మా ప్రయాణం మొదలై.. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారాం. ఇప్పుడు భాగస్వాములమయ్యాం. విజయ్ చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి. సెట్‌లో పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారు. బయట మాత్రం చాలా ఆప్యాయంగా ఉంటారు. పెళ్లికి ముందు, ఆ తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదు.

వివరాలు

కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నా

వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతం రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నానని రష్మిక పేర్కొన్నారు.

స్టార్‌డమ్‌ కారణంగా ఎదురయ్యే ఒత్తిడి గురించి కూడా రష్మిక మాట్లాడారు.

'ఎప్పుడూ స్పాట్‌లైట్‌లో నిలబడటం అంటే.. ఎవరో తలపై తుపాకీ గురిపెట్టినట్లు అనిపిస్తుంది'' అని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'రణబాలి' (Ranabaali) సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది.

ప్రస్తుతం రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం 'మైసా' (Mysaa) చిత్రీకరణ చివరి దశలో ఉంది.

అలాగే ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT