OTT Today: ఓటీటీలో ఇవాళ 16 సినిమాల సందడి.. 11 స్పెషల్, తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇవాళ ఒక్కరోజే ఓటిటి ప్రియులకు భారీ విందు లభించింది. ఏకంగా 16 సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ వంటి విభిన్న జానర్లలో కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు వాటి వివరాలు చూద్దాం.
Details
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా) - ఫిబ్రవరి 13 ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కిష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 13 ది ఆర్ట్ ఆఫ్ సారా (సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్) - ఫిబ్రవరి 13 ఇన్ ది మడ్ సీజన్ 2 (అర్జెంటీనా ప్రిజన్ డ్రామా, క్రైమ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 13 బ్లూ మూన్ (ఇంగ్లీష్ బయోగ్రఫీ మ్యూజికల్ డ్రామా సినిమా) - ఫిబ్రవరి 14
Details
అమెజాన్ ప్రైమ్ వీడియో
బ్యాండ్‌వాలే (హిందీ మ్యూజికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 13 లవ్ మీ లవ్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం) - ఫిబ్రవరి 13 జీ5 ఓటీటీ ఉత్తర్ (మరాఠీ ఫ్యామిలీ డ్రామా చిత్రం) - ఫిబ్రవరి 13 భానుప్రియ భూతర్ హోటల్ (బెంగాలీ హారర్ కామెడీ సినిమా) - ఫిబ్రవరి 13 పాతిరాత్రి (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా చిత్రం) - ఫిబ్రవరి 13 సన్ నెక్ట్స్ ఓటీటీ సూర్య: ది పవర్ ఆఫ్ లవ్ (కన్నడ రొమాంటిక్ యాక్షన్ చిత్రం) - ఫిబ్రవరి 13 మాయాబింబమ్ (తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా) - ఫిబ్రవరి 13
Details
జియో హాట్‌స్టార్
ది కంజూరింగ్: లాస్ట్ రిట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా) - ఫిబ్రవరి 13 ఇతర ఓటీటీలు ఎటర్నిటీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా ఫాంటసీ చిత్రం) - Apple TV+ - ఫిబ్రవరి 13 హనీ బంచ్ (ఇంగ్లీష్ సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా) - Shudder - ఫిబ్రవరి 13 ది రఫ్ నెక్ (అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం) - Lionsgate Play - ఫిబ్రవరి 13
Details
ఓటీటీలోకి ఇవాళ 16 విడుదలలు
ఈ విధంగా ఫిబ్రవరి 13న ఒక్కరోజే 16సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ అయిన ది కంజూరింగ్: లాస్ట్ రిట్స్, హనీ బంచ్, భానుప్రియ భూతర్ హోటల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్, ది ఆర్ట్ ఆఫ్ సారా, బ్యాండ్‌వాలే, లవ్ మీ లవ్ మీ వంటి చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇవేకాక పాతిరాత్రి, సూర్య: ది పవర్ ఆఫ్ లవ్, మాయాబింబమ్, ది రఫ్ నెక్ వంటి చిత్రాలతో కలిపి మొత్తం 11 సినిమాలు/సిరీస్‌లు ప్రత్యేకంగా చూడదగ్గవిగా ఉన్నాయి. వీటిలో తెలుగులో అందుబాటులో ఉన్న ఆసక్తికరమైన విడుదలలు మాత్రం కేవలం మూడు మాత్రమే ఉన్నాయి.