Page Loader
Sanjay Dutt: సౌత్‌లో ఉంది నిజమైన సినిమా ప్యాషన్‌.. సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్‌!
సౌత్‌లో ఉంది నిజమైన సినిమా ప్యాషన్‌.. సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్‌!

Sanjay Dutt: సౌత్‌లో ఉంది నిజమైన సినిమా ప్యాషన్‌.. సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ దక్షిణాదికి మరింత దగ్గరవుతున్నారు. 'కేజీఎఫ్ 2', 'లియో' వంటి సౌత్‌ బిగ్‌ ప్రాజెక్టుల్లో విలన్‌గా ఆకట్టుకున్న ఆయన తాజాగా మరోసారి తన మనసులో మాటను బయటపెట్టారు. తాజాగా ఓ మీడియా ప్రతినిధి సంజయ్ దత్‌ను ప్రశ్నిస్తూ, ఇక్కడి నుంచి మీ ఇంటికి (బాలీవుడ్‌కు) ఏం తీసుకెళతారని అడిగాడు. దీనికి స్పందించిన సంజయ్ ఇక్కడి నుంచి మంచి సినిమాలపై ఉన్న ప్యాషన్‌ను బాలీవుడ్‌కి తీసుకెళ్తా అంటూ వెల్లడించారు. ఇకపై మరింత స్పష్టంగా స్పందించిన సంజయ్ దత్, గతంలో బాలీవుడ్‌లోనూ గొప్ప సినిమాల పట్ల ప్యాషన్ ఉండేదని చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, సినిమాల కంటే కలెక్షన్లు, నంబర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.

Details

సంజయ్ దత్ మాస్ లుక్‌కు అభిమానులు ఫిదా

దక్షిణాది ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికీ ఆ ప్యాషన్ కనిపిస్తోందని, అందుకే ఇక్కడ పనిచేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సంజయ్ ప్రస్తుతం కన్నడ యాక్షన్ మూవీ 'కేడీ ది డెవిల్'లో నటిస్తున్నారు. ధృవ సర్జా ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో శిల్పా శెట్టి, రమేశ్ అరవింద్‌ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో సంజయ్ దత్ మాస్ లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక, బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లోనూ జోరు కొనసాగిస్తున్న సంజయ్ దత్ భవిష్యత్‌లో మరిన్ని పెద్ద ప్రాజెక్టుల్లో కనిపించనున్నారని సమాచారం