LOADING...
Prakash Raj: అవార్డుల ఎంపికలో జోక్యం జరుగుతోంది.. మమ్ముట్టి లాంటి మహానటుడికి ఇవి అవసరం లేవు : ప్రకాశ్‌రాజ్‌ 
అవార్డుల ఎంపికలో జోక్యం జరుగుతోంది.. మమ్ముట్టి లాంటి మహానటుడికి ఇవి అవసరం లేవు : ప్రకాశ్‌రాజ్

Prakash Raj: అవార్డుల ఎంపికలో జోక్యం జరుగుతోంది.. మమ్ముట్టి లాంటి మహానటుడికి ఇవి అవసరం లేవు : ప్రకాశ్‌రాజ్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ జాతీయ అవార్డుల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చలనచిత్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల 55వ కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రకటన అనంతరం ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj)ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ చలనచిత్ర అవార్డులు ఇప్పుడు రాజీ పడుతున్నాయని చెప్పడానికి నాకు భయం లేదు. ఈజ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించడం నాకు ఆనందంగా ఉంది. కేరళ ప్రభుత్వ కమిటీ నాకు ఫోన్‌ చేసి, కేరళకు చెందినవారు కాని, నటనలో అనుభవం ఉన్నవ్యక్తి జ్యూరీ ఛైర్మన్‌గా ఉండాలని కోరారు. నేను అంగీకరించాను. కమిటీ సభ్యులు అవార్డుల ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకోబోమని, నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారు.

Details

అనేక చిత్రాలకు ఉత్తమ నటుడిగా అవార్డు

కానీ, ఆ మాటలు వాస్తవంగా నిలవలేదు. ఆ వ్యవస్థలో కొందరికే అవార్డులు దక్కుతున్నాయి. జ్యూరీ రాజీ పడుతున్నప్పుడు, మమ్ముట్టి (Mammootty) లాంటి గొప్ప నటుడికి ఇలాంటి అవార్డులు అవసరం లేదని ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మమ్ముట్టి గతంలో అనేక చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ఆయన చేసిన పలు విశిష్ట చిత్రాలకు అవార్డులు రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. తాజాగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 'భ్రమయుగం' చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డు లభించింది. దీంతో అత్యధిక సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న నటుడిగా మమ్ముట్టి రికార్డు సృష్టించారు.